పవన్ కోసం కథ రెడీ చేసిన త్రివిక్రమ్
- పవన్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో రెండు హిట్లు
- త్రివిక్రమ్ కథకి పవన్ గ్రీన్ సిగ్నల్
- ఇద్దరి కలయికలో నాలుగో సినిమా
ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' చేస్తున్న పవన్, ఆ తరువాత సినిమాను క్రిష్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇక ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ ఒక ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు. ఈ రెండు సినిమాలు విడుదల తరువాత, పవన్ - త్రివిక్రమ్ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళుతుందని చెబుతున్నారు. పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది ఒక శుభవార్తేనని చెప్పాలి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.