ప్రస్తుత పరిస్థితుల్లో ధోనీకి కష్టమే: వెంకటేశ్ ప్రసాద్
- 40 ఏళ్ల వయసులో రీఎంట్రీ అంత సులభం కాదు
- ఒక వ్యూహంలో భాగంగానే జట్టులోకి తీసుకునే అవకాశం
- ధోనీ బ్యాటింగ్ స్థానాన్ని మార్చాలి
టీమ్ మేనేజ్ మెంట్ ఒక వ్యూహంలో భాగంగా ధోనీని కోరుకుంటే తప్ప... అతని రీఎంట్రీ అసాధ్యమని వెంకటేశ్ ప్రసాద్ చెప్పారు. ఒకవేళ ధోనీని జట్టులోకి తీసుకున్నా... అతని బ్యాటింగ్ స్థానాన్ని మార్చాలని అన్నారు. ఫినిషర్ గా కాకుండా.... మూడు లేదా నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ కు పంపాలని చెప్పారు. తనకే అవకాశం ఉంటే ఇదే చేస్తానని అన్నారు.