పీపీఈ కిట్లు ధరించి హెయిర్ కటింగ్.. ఫొటో వైరల్
- గుజరాత్, ఖేడా ప్రాంతంలోని సెలూన్ లో ఏర్పాటు
- కస్టమర్లు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు
- క్షురకులు, కస్టమర్లకు కరోనా సోకకుండా జాగ్రత్తలు
అతడు వ్యక్తిగత పరిరక్షణ పరికరాలు (పీపీఈ) ధరించి మరీ హెయిర్ కటింగ్ చేస్తున్నాడు. అంతేకాదు, ఆ సెలూన్‌లో కస్టమర్లు కూడా అన్ని జాగ్రత్తలు పాటించేలా క్షురకుడు చర్యలు తీసుకుంటున్నాడు. ఆ సెలూన్‌కు వచ్చిన కస్టమర్లు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి ఉన్నారు.
'ప్రభుత్వం సూచించిన అన్ని జాగ్రత్తలను మేము తీసుకుంటున్నాం. క్షురకులు, కస్టమర్లకు కరోనా సోకకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం' అని ఆ సెలూన్ యజమాని విశాల్ లింయాచియా మీడియాకు తెలిపారు. కరోనా నుంచి కాపాడడానికి పీపీఈ కిట్లు అద్భుతంగా పనిచేస్తాయి.