‘ఆరోగ్య సేతు’ తప్పనిసరిగా వాడాలని కేంద్రం చెప్పడం చట్టవిరుద్ధం: జస్టిస్ శ్రీకృష్ణ
- ‘ఆరోగ్య సేతు’ను తప్పనిసరిగా వాడాలన్న కేంద్రం
- చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం ఈ యాప్ ను తప్పనిసరి చేస్తున్నారు?
- ఇప్పటి వరకూ ఏ చట్టమూ ఈ యాప్ ను సమర్థించట్లేదు
ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా వాడాలని కేంద్రం చెప్పడం చట్టవిరుద్ధమని అన్నారు. చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం ఈ యాప్ ను తప్పనిసరి చేస్తున్నారు? అని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకూ ఏ చట్టమూ ఈ యాప్ ను సమర్థించట్లేదని స్పష్టం చేశారు. మొబైల్స్ లో ఈ యాప్ లేకపోతే ఆరు నెలల జైలు శిక్ష, రూ.1000 వరకు జరిమానా విధిస్తామని నోయిడా పోలీసులు ఆదేశించారని, ఇది చట్ట వ్యతిరేకం అని, ఇలాంటి ఆదేశాలను కోర్టుల్లో సవాలు చెయ్యవచ్చని అన్నారు.