ఏపీలో 24 గంటల్లో 10,730 శాంపిళ్ల పరీక్ష.. మరో 33 మందికి కరోనా నిర్ధారణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీలో 24 గంటల్లో 10,730 శాంపిళ్ల పరీక్ష.. మరో 33 మందికి కరోనా నిర్ధారణ

coronavirus cases in ap
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,051
  • ప్రస్తుతం ఆసుపత్రుల్లో 949 మందికి చికిత్స
  • ఇప్పటివరకు 1,056 మంది డిశ్చార్జ్
  • 24 గంటల్లో 58 మంది డిశ్చార్జ్
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 10,730 శాంపిళ్లను పరీక్షించగా మరో 33 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,051గా ఉందని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 949 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,056 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 58 మంది కొవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పటివరకు ఏపీలో 46 మంది కరోనా వల్ల మృతి చెందారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో చిత్తూరులో 10, తూర్పు గోదావరిలో 1,  కృష్ణాలో 4, నెల్లూరులో, కర్నూలు జిల్లాల్లో 9 చొప్పున కేసులు నమోదయ్యాయని వివరించింది.ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది.
                     
జిల్లాల వారిగా కేసుల వివరాలు..
         

Corona Virus
COVID-19
Lockdown

More Telugu News