గుజరాత్‌లో 24 గంటల్లో 20 మంది మృతి.. 19 మంది అహ్మదాబాద్ వారే!

Gujarat Records 20 deaths in 24 hours
గుజరాత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 347 కేసులు నమోదు కాగా, 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 19 మంది ఒక్క అహ్మదాబాద్‌లోనే మరణించడం గమనార్హం. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మరణాల సంఖ్య 8,542కు చేరుకోగా, మరణాల సంఖ్య  513కు పెరిగింది. ఒక్క అహ్మదాబాద్‌లోనే 6,086 కేసులు నమోదు కావడం గమనార్హం. అలాగే, కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,780 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
Go Back to Shorts
Gujarat
Ahmedabad
Corona Virus

More Telugu News