తీహార్ జైల్లో కరోనా కలకలం... ఖైదీకి పాజిటివ్, జైలర్లకు క్వారంటైన్

Tihar jail inmate tested corona positive
  • ఇటీవలే ఓ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి
  • జ్యుడిషియల్ కస్టడీ విధించిన న్యాయస్థానం
  • కరోనా లక్షణాలతో బాధపడుతున్న వైనం
ఢిల్లీ తీహార్ జైల్లో కరోనా కలకలం రేగింది. ఓ రిమాండ్ ఖైదీకి కరోనా పాజిటివ్ గా తేలడంతో జైలు వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఆ వ్యక్తి ఇటీవలే అత్యాచారం ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. అతడికి న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో తీహార్ జైలుకు తరలించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో, జైల్లోని కొందరు జైలర్లను క్వారంటైన్ కు పంపారు. పెద్ద సంఖ్యలో ఖైదీలు ఉన్న తీహార్ జైలులో కరోనా కేసు వెలుగుచూడడంతో జైలు వర్గాల్లో ఆందోళన మొదలైంది.
Go Back to Shorts
Tihar Jail
Inmate
Corona Virus
Positive
Jailers

More Telugu News