సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున చరిత్ర సృష్టించిన భారత్!
- 1998 మే 11న ఫోక్రాన్ అణుపరీక్షలను నిర్వహించిన భారత్
- ఉలిక్కి పడ్డ ప్రపంచ అగ్ర దేశాలు
- మే 11ను 'నేషనల్ టెక్నాలజీ డే'గా జరుపుకుంటున్న ఇండియా
ప్రపంచంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా పసిగట్టే అమెరికా కళ్లుగప్పి ఈ పరీక్షలను ఇండియా నిర్వహించింది. భూగర్భ అణపరీక్షలను నిర్వహించిన తర్వాత కానీ అమెరికా ఈ విషయాన్ని పసిగట్టలేకపోయింది. ఆ తర్వాత భారత్ పై అమెరికా భగ్గుమంది. ఆంక్షలను విధించింది. అయినప్పటికీ ఆ తర్వాత భారత్ స్వయంకృషితో శాస్త్ర, సాంకేతాక రంగాల్లో గణనీయమైన అభివృద్దిని సాధించింది. ఫోక్రాన్ అణు పరీక్షలను నిర్వహించిన మే 11వ తేదీని భారత్ 'నేషనల్ టెక్నాలజీ డే'గా జరుపుకుంటోంది.