అమ్మాయిలకు ఆర్థిక సాయం చేస్తానని చెబుతూ.. అత్యాచారాలు చేస్తున్న వృద్ధుడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమ్మాయిలకు ఆర్థిక సాయం చేస్తానని చెబుతూ.. అత్యాచారాలు చేస్తున్న వృద్ధుడు!

70 years old man rapes woman in Hyderabad
  • బంజారాహిల్స్ లో ఘోరాలు
  • పేద అమ్మాయిలపై వల
  • ఇంటికి పిలిపించుకుని అత్యాచారాలు
వయసు 70 ఏళ్లు. నలుగురు భార్యలు ఉన్నారు. కాటికి కాలుచాపుకున్నాడు. అయితేనేం... బుద్ధి గడ్డితినింది. అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. ఈ దారుణం హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీకి చెందిన మొహమ్మద్ సలీం తన నలుగురు భార్యలతో కలిసి విదేశాల్లో ఉంటున్నాడు. అయితే, అమ్మాయిల కోసం తరచూ హైదరాబాదుకు వస్తుంటాడు. నిరుపేద అమ్మాయిలకు ఆర్థిక సాయం చేస్తానని చెబుతూ... బంజారాహిల్స్ లోని తన ఇంటికి పిలిపించుకుని అఘాయిత్యానికి పాల్పడుతుంటాడు.

తాజాగా 23 ఏళ్ల ఓ యువతిని ఇంటికి పిలిపించుకుని, మత్తు మందు ఇచ్చి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన బాధితురాలు... పూర్తి ఆధారాలతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను కలిసింది. ఈ కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. పోలీసుల విచారణలో సలీమ్ పలువురు అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడినట్టు తేలింది.
Hyderabad
Banjara Hills
Rape
Old Man

More Telugu News