అమ్మాయిని ఎరగా చూపి... డబ్బు నొక్కేసిన సైబర్ నేరగాళ్లు!
- లాక్ డౌన్ కారణంగా ఇంట్లో నుంచే పని
- నెట్లో కనిపించిన నంబర్ ను సంప్రదిస్తే మోసం
- రూ. 80 వేలు చెల్లించిన ఐటీ ఉద్యోగి
ఆపై వీడియో కాలింగ్ ద్వారానూ వారిద్దరూ మాట్లాడుకున్నారు. ఈ వీడియో కాల్స్ ను క్యాప్చర్ చేసిన కేటుగాళ్లు, ఆపై అతన్ని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించడంతో, రూ. 80 వేల వరకూ సమర్పించుకున్నాడు. ఆ తరువాత కూడా వేధింపులు ఆగలేదు. బాధితుడు స్పందించక పోవడంతో ఆ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాఫ్తు ప్రారంభించారు.