నిన్న పోస్ట్ చేసిన అమ్మాయిల ఫొటోపై రామ్ గోపాల్ వర్మ వివరణ!
- నిన్నటి వర్మ ట్వీట్‌పై విమర్శలు
- అమ్మాయిలకు కూడా మద్యం కొనుక్కునే హక్కు ఉందని ఒకరి ట్వీట్
- ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన వర్మ
- తనను తప్పుగా అర్థం చేసుకున్నారని వ్యాఖ్య
తనపై విమర్శలు గుప్పిస్తూ చేసిన ఆ ట్వీట్‌ను వర్మ రీట్వీట్ చేస్తూ... 'హేయ్.. నా ట్వీట్‌ను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారనుకుంటా. ఇతరుల విషయంపై ఓ అభిప్రాయానికి వచ్చి తీర్పు ఇవ్వాలని భావించే వారిలో నేను చివరి వరసలో ఉంటాను. పురుషులు మాత్రమే తాగుతారని, ఆ మత్తులో మహిళలను దూషిస్తారని తప్పుగా భావించే నాయకులను ఉద్దేశించే ఇది' అని చెప్పారు.