అనంతపురం జిల్లాలో హిందూపురం నుంచే అత్యధిక ‘కరోనా’ కేసులు: నాదెండ్ల మనోహర్
- హిందూపురం ప్రాంతం భయాందోళనల్లో ఉంది
- అదేవిధంగా అనంతపురం పట్టణ ప్రాంతం కూడా
- ఉద్యానవన పంటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
చీనీ, అరటి, దానిమ్మ, మామిడి లాంటి ఉద్యానవన పంటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని, మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం పెద్ద మాటలు చెప్పిందని, వాటిని అమలు చేసి చూపించాలని డిమాండ్ చేశారు. ఏపీలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని, ‘కరోనా’ విపత్తు సమయంలో జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు సాగిస్తున్నట్టు తమకు సమాచారం ఉందని అన్నారు. ఈ అక్రమాలపై పార్టీ నాయకులు దృష్టి సారించాలని సూచించారు.