టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎంపీ సానా సతీశ్
- తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎంపీ సానా సతీశ్ బాబును నియమించిన చంద్రబాబు
- కొత్తగా ప్రకటించిన 18 మంది ఉపాధ్యక్షుల బృందంలో సతీశ్ కు చోటు
- కష్టపడే కార్యకర్తకు టీడీపీలో గుర్తింపు ఉంటుందన్న సానా సతీశ్
- పార్టీ నమ్మకాన్ని నిలబెడతానని వెల్లడి
తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ బాబుకు కీలక పదవి లభించింది. ఆయన్ను పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించారు. బుధవారం ప్రకటించిన పార్టీ పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీల నియామకాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
మొత్తం 18 మంది సభ్యులతో కూడిన జాతీయ ఉపాధ్యక్షుల బృందంలో సానా సతీశ్ బాబుకు స్థానం కల్పించారు. ఈ నియామకంపై సతీశ్ బాబు హర్షం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సతీశ్ బాబు మాట్లాడుతూ, "సాధారణ కార్యకర్త స్థాయి నుంచి నాయకుడిగా ఎదిగే అవకాశం కేవలం తెలుగుదేశం పార్టీలోనే ఉంది. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో తప్పకుండా గుర్తింపు లభిస్తుంది" అని అన్నారు.
తనపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని తెలిపారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సతీశ్ బాబు స్పష్టం చేశారు.