తెలంగాణలో కొత్తగా 21 కేసులు... జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికం

  • జీహెచ్ఎంసీ పరిధిలో 20 కొత్త కేసులు
  • తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1082
  • ఇవాళ 46 మంది డిశ్చార్జి
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా 21 కేసులు వెల్లడయ్యాయి. వాటిలో 20 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే గుర్తించారు. మరో కేసు జగిత్యాల్ జిల్లాలో బయటపడింది. ఇక తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1082కి పెరిగింది. ఇవాళ 46 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 508 మంది చికిత్స పొందుతున్నారు. 29 మంది మరణించారు. కాగా, ఇప్పటివరకు తెలంగాణలోని వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అంతేకాదు, 17 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్కరికీ కరోనా నిర్ధారణ కాలేదు.

Telangana
Corona Virus
Positive Cases
GHMC

More Telugu News