కరోనా పరిస్థితులపై ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష

CM KCR reviews corona situations
  • తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • ఇప్పటివరకు 1061 కేసులు
  • ఉన్నతాధికారులతో కరోనా చర్యలపై సీఎం కేసీఆర్ చర్చ
తెలంగాణలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. కొన్నిరోజుల కిందట కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు అనిపించినా, మళ్లీ కొత్త కేసులు వెలుగుచూస్తుండడం పట్ల సీఎం కేసీఆర్ అప్రమత్తమయ్యారు.

ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఆయన ప్రగతిభవన్ లో సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ, వలస కార్మికుల తరలింపుపై చర్చిస్తున్నారు. ఈ నెల 5న క్యాబినెట్ భేటీలో చర్చించాల్సిన అంశాలపైనా కసరత్తు చేస్తున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకు 1061 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 29 మంది మరణించారు.
Go Back to Shorts
KCR
Review
Corona Virus
Pragathi Bhavan
Telangana

More Telugu News