లాక్ డౌన్ మళ్లీ పొడిగించడంతో పెళ్లి నిరవధికంగా వాయిదా వేసుకున్న హీరో నిఖిల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లాక్ డౌన్ మళ్లీ పొడిగించడంతో పెళ్లి నిరవధికంగా వాయిదా వేసుకున్న హీరో నిఖిల్!

Hero Nikhil postpones his wedding once again
  • డాక్టర్ పల్లవి వర్మతో ఫిబ్రవరి 3న నిఖిల్ నిశ్చితార్థం
  • ఏప్రిల్ 16న పెళ్లికి అంతా సిద్ధం
  • అంతకుముందే లాక్ డౌన్ ప్రకటన
  • మే14కి పెళ్లి వాయిదా
  • మరోసారి లాక్ డౌన్ పొడిగింపు 
ఎవరి జీవితంలో అయినా పెళ్లి ఓ మధురానుభూతి. కానీ, కరోనా దెబ్బకు మానవ జీవితాలు అస్తవ్యస్తంగా మారుతున్న నేపథ్యంలో వివాహం అనేది ప్రాధాన్యత అంశాల క్రమంలో వెనకబడింది. హీరో నిఖిల్ వ్యవహారమే అందుకు నిదర్శనం. నిఖిల్ కొన్నినెలల కిందట భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మతో నిశ్చితార్థం జరుపుకున్నాడు. ఫిబ్రవరి 3న నిశ్చితార్థం జరగ్గా, అప్పటికే చైనాలో కరోనా బీభత్సం కొనసాగుతుంది. ఇక, నిఖిల్ ఏప్రిల్ 16న పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా, అంతకుముందే లాక్ డౌన్ రావడంతో ఆ పెళ్లి మే 14కి వాయిదా పడింది. ఇప్పుడు కూడా అదే తంతు!

లాక్ డౌన్ మే 17 వరకు పొడిగించడంతో ఇక తన వల్ల కాదంటూ హీరో నిఖిల్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. కరనా వైరస్ తొలగిపోయేంత వరకు పెళ్లి లేదని, నిరవధికంగా వాయిదా వేస్తున్నానని తెలిపాడు. తన వివాహం కారణంగా ఒక్క వ్యక్తికి కరోనా సోకినా అది తనకు మాయని మచ్చ అవుతుందని, అందుకే కరోనా పరిస్థితులు పూర్తిగా సమసిసోయేపవరకు వేచిచూస్తానని నిఖిల్ వెల్లడించాడు. తన కాబోయే భార్య పల్లవి కూడా ఇదే అభిప్రాయంతో ఉందని, కరోనా పూర్తిగా నిర్మూలన జరిగిన తర్వాత తన పెళ్లి ఉంటుందని స్పష్టం చేశాడు.
Hero Nikhil
Wedding
Dr Pallavi Varma
Engagement
Lockdown
Corona Virus

More Telugu News