శ్రీవారి ఆలయంలో ప్రవేశంపై నారా లోకేశ్ కు బదులిచ్చిన వైవీ సుబ్బారెడ్డి
- శ్రీవారి ఆలయంలో పుట్టినరోజు వేడుకలా అంటూ లోకేశ్ ట్వీట్
- నీ ట్వీట్ అబద్ధం అంటూ వైవీ రిప్లయ్
- తప్పు తెలుసుకో అంటూ హితవు
"నారా లోకేశ్... ప్రతి శుక్రవారం శ్రీవారికి జరిగే అభిషేకానికి రెండు వారాలకు ఓసారి టీటీడీ చైర్మన్ హాజరవడం ఆనవాయితీ. నేను కూడా ఆ హోదాలోనే వెళ్లాను. ఆ ఫొటోలో నా తల్లిగారు, నా అర్ధాంగి, టీటీడీ ఉద్యోగులు తప్ప నా బంధువులెవరూ లేరు. నీ ట్వీట్ అబద్ధం. ఇప్పటికైనా తప్పు తెలుసుకో. కొంచెమైనా పాప భీతి ఉండాలి" అంటూ హితవు పలికారు.