భారత్‌లో రికార్డు కేసులు.. 24 గంటల్లో 2,293 మందికి కరోనా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారత్‌లో రికార్డు కేసులు.. 24 గంటల్లో 2,293 మందికి కరోనా!

Total number of COVID19 positive cases in India rises to 37336 including 26167 active cases
  • 24 గంటల్లో 71 మంది మృతి
  • కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,218
  • కేసుల సంఖ్య  మొత్తం 37,336
  • ఆసుపత్రుల్లో 26,167 మందికి చికిత్స
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి.  గత 24 గంటల్లో భారత్‌లో ఇప్పటివరకు ఏ రోజూ నమోదు కానన్ని కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో 2,293 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 71 మంది ప్రాణాలు కోల్పోయారు.

దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,218కి చేరింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 37,336కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 9,950  మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 26,167  మంది చికిత్స పొందుతున్నారు.
Corona Virus
COVID-19
Lockdown
India

More Telugu News