నేటి నుంచి వలస కార్మికులకు అందుబాటులోకి వచ్చిన రైళ్లు: మంత్రి తలసాని
- తలసానికి కిషన్‌రెడ్డి ఫోన్
- రైలు సేవలపై కేంద్రం కీలక నిర్ణయం
- తెలంగాణ నుంచి ఝార్ఖండ్‌కు బయలుదేరిన తొలి రైలు
కాగా, లాక్డౌన్ సడలింపులు ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటే సరికాదని, వలస కూలీలను రైళ్లలో తరలించాలని నిన్న తలసాని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. రైళ్లు ఏర్పాటు చేయాలంటూ తలసాని చేసిన సూచన బాగుందని కిషన్ రెడ్డి అన్నారు. కాగా, లాక్డౌన్ విధించిన అనంతరం తొలిసారి ప్రయాణికుల కోసం రైలు కదిలింది. ఈ రోజు ఉదయం తెలంగాణ నుంచి ఝార్ఖండ్‌కు వలస కూలీలతో ఓ రైలు బయలు దేరింది. లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 1,200 మంది కూలీలు ఝార్ఖండ్‌లోని హతియా జిల్లాకు బయలుదేరారు.