నిర్మాతగా మహేశ్ బాబు .. హీరోగా చరణ్?
- వంశీ పైడిపల్లి కథను పక్కన పెట్టలేదు
- కొత్త కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చరణ్
- గతంలో హిట్ కొట్టిన 'ఎవడు'
ఆ కథకి చరణ్ సెట్ అవుతాడనీ, ఆయనను ఒప్పిస్తే తాను నిర్మిస్తానని వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు అన్నాడట. గతంలో 'ఎవడు' సినిమాతో చరణ్ కి హిట్ ఇచ్చిన కారణంగా, ఆయనతో వంశీ పైడిపల్లికి ఎంతో సాన్నిహిత్యం వుంది. దాంతో చరణ్ కి వంశీ పైడిపల్లి ఆ కథను వినిపించడం, ఆ కథకి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయిందని అంటున్నారు. ఈ సినిమాకి చరణ్ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.