విజయవాడలో కరోనా కేసులు పెరుగుతుండటంపై జిల్లా కలెక్టర్ స్పందన

29-04-2020 Wed 15:03 | Andhra
  • ప్రజలు జాగ్రత్తలు పాటించడం లేదు
  • కృష్ణలంక, ఖుద్దూస్ నగర్ ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి
  • నిబంధనలను ఇకపై ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. విజయవాడలో కేసులు పెరుగుతున్న తీరు కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో, విజయవాడలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా  ఇంతియాజ్ మాట్లాడుతూ, విజయవాడ ప్రజలు తగు జాగ్రత్తలు పాటించడం లేదని చెప్పారు. కృష్ణలంక, ఖుద్దూస్ నగర్ ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదయ్యాయని తెలిపారు. ప్రజలు సామూహిక సమావేశాల్లో పాల్గొనడం వల్లే కేసులు ఎక్కువ అయ్యాయని  చెప్పారు. ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలని, స్వీయ నియంత్రణ పాటించాలని విన్నవించారు. లాక్ డౌన్ నిబంధనలను ఇకపై ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పోలీస్ కమిషనర్ ద్వారాకా తిరుమలరావు మాట్లాడుతూ, ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దని  కోరారు. రెడ్ జోన్ ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసరాలను సరఫరా చేస్తామని చెప్పారు. విధినిర్వహణలో ఉన్నవారికి కూడా వైరస్ సోకిందని... 13 మంది పోలీసులకు, 12 మంది వాలంటీర్స్ కు వచ్చిందని తెలిపారు. కేసులు పెరిగే కొద్ది పోలీసు చర్యలు కఠినమవుతాయని హెచ్చరించారు.
VijayawadaCorona VirusDistrict Collector

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more