లాక్ డౌన్ తర్వాత రైల్వే ప్రయాణికులు ఈ నిబంధనలు పాటించడం తప్పనిసరి!
- 2 గంటల ముందే స్టేషన్ కు చేరాలి
- మాస్క్ లు, భౌతిక దూరం తప్పనిసరి
- వైద్య పరీక్షల అనంతరమే ప్రయాణికులకు అనుమతి
రైలు ఎక్కాలంటే, ఎయిర్ పోర్టుకు వెళ్లినట్టుగా కనీసం 2 గంటల ముందే స్టేషన్ కు రావాల్సి వుంటుంది. మాస్క్ లు ధరించడం తప్పనిసరి. ఆపై ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఎటువంటి అనారోగ్యమూ లేదని తేలితేనే రైలు ఎక్కేందుకు అనుమతి లభిస్తుంది. ఇక బుకింగ్ కౌంటర్ వద్ద టికెట్ తీసుకోవాలన్నా భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. ఈ మేరకు రైల్వే స్టేషన్లలో ధర్మల్ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.