Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సూర్య హీరోగా గౌతమ్ మీనన్ సస్పెన్స్ థ్రిల్లర్

Surya Movie with Goutham Menon
  • వరుస సినిమాలతో సూర్య
  • గౌతమ్ మీనన్ తో రెండు హిట్లు
  • మూడో సినిమాకి సన్నాహాలు
మొదటి నుంచి కూడా సినిమాకి .. సినిమాకి మధ్య సూర్య గ్యాప్ రాకుండా చూసుకుంటూ వస్తున్నాడు. పరాజయాలు పలకరించినా, కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళుతుంటాడు. అలా ప్రస్తుతం ఆయన వరుస సినిమాలు చేస్తున్నాడు. సుధ కొంగర సినిమాను పూర్తి చేసిన ఆయన, హరి దర్శకత్వంలో 'సింగం' సీక్వెల్ చేస్తున్నాడు.

ఆ తరువాత శివ .. వెట్రిమారన్ .. లోకేశ్ కనగరాజ్ లను లైన్లో పెట్టేశాడు. విభిన్నమైన కథలతో విజయాలను అందుకున్న దర్శకులుగా ఈ ముగ్గురికి మంచి పేరుంది. ఈ సినిమాలన్నీ కూడా ఒకదాని తరువాత ఒకటిగా మొదలుకానున్నాయి. ఆ తరువాత సినిమాను ఆయన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేయనున్నట్టు తెలుస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో రెండు భారీ హిట్లు వచ్చాయి. ఇటీవలే గౌతమ్ మీనన్ వినిపించిన కథకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ కథ నడుస్తుందట. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
Surya
Gowtham Menon
KollyWood

More Telugu News