Pawan Kalyan: దక్షిణాదిన ట్విట్టర్‌లో ఏ ప్రాంతీయ పార్టీకీ దక్కని ఘనత మాకు దక్కింది!: పవన్ కల్యాణ్

1 MILLION JANASAINIKS on Twitter JanaSenaParty Got to know that this is the highest for any regional party in South India
షార్ట్స్‌లో చూడండి
దక్షిణాదిన ట్విట్టర్‌లో ఏ ప్రాంతీయ పార్టీకీ దక్కని ఘనత తమకు దక్కిందంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. జనసేన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య 10 లక్షలు చేరిన సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.

'మా ట్విట్టర్‌ ఖాతాలో ఇప్పుడు ఒక మిలియన్ జనసైనికులు ఉన్నారు. దక్షిణాదిన ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత మంది ఫాలోవర్లు జనసేనకి ఉన్నట్లు తెలుసుకున్నాను. జనసేన పార్టీ శతఘ్ని టీమ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే, సామాజిక మాధ్యమాల్లో ఉన్న ప్రతి ఒక్క జనసైనికుడికి ధన్యవాదాలు. మన దేశం గర్వపడేలా మన సైనికులను పెంచుకుందాం.. జై హింద్' అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

కాగా, జనసేన నేతలు, కార్యకర్తలు చేస్తోన్న సేవా కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఆ పార్టీ కార్యకర్తలు పోస్ట్ చేస్తుంటారు. పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తుంటారు.  
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
Twitter

More Telugu News