నాగపూర్ లో దారుణం... తండ్రిని గొంతు కొరికి చంపిన జిమ్ ట్రైనర్

  • సినిమా డైలాగులు చెబుతూ కిరాతక హత్య
  • జననావయవాలను కోసేసిన వైనం
  • హడలిపోయిన తల్లి, సోదరి
మహారాష్ట్రలోని నాగపూర్ లో భయానక ఘటన చోటుచేసుకుంది. ఉన్మాదం తలకెక్కిన ఓ జిమ్ ట్రైనర్ తన తండ్రిని గొంతు కొరికి చంపడం తీవ్ర కలకలం రేపింది. నగరంలోని హుద్కేశ్వర్ ప్రాంతంలో ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. విక్రాంత్ పిల్లేవార్ అనే పాతికేళ్ల యువకుడు జిమ్ ట్రైనర్ గా పనిచేస్తున్నాడు. తండ్రి పేరు విజయ్ (55). అయితే ఎలాంటి గొడవ లేకుండానే అతడు ఓ ఉన్మాదిలా వ్యవహరించాడు. తండ్రి గొంతును బలంగా కొరికాడు. దాంతో తీవ్ర రక్తస్రావం అయింది. ఆయనను అలాగే లాక్కొచ్చి వరండాలో పడేశాడు. అంతేకాదు, కత్తితో ఆయన జననావయవాలు కోసేశాడు. దాంతో ఆయన అక్కడిక్కడే మరణించాడు.

ఈ దారుణాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన తల్లి, సోదరి వణికిపోయారు. వారిని కూడా విక్రాంత్ బెదిరించాడు. కాగా, హత్య సందర్భంగా విక్రాంత్ సినిమా డైలాగులు చెబుతూ దారుణానికి పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుడు బలాఢ్యుడు కావడంతో అతడిని అదుపులోకి తీసుకునేందుకు ఐదుగురు కానిస్టేబుళ్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

Gym Trainer
Murder
Nagpur
Maharashtra
Police

More Telugu News