లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించేవారిని దూరం నుంచే పట్టుకునేందుకు చండీగఢ్ పోలీసుల కొత్త ఐడియా
- చండీగఢ్ లో వినియోగిస్తున్న పోలీసులు
- వీడియో పోస్టు చేసిన చండీగఢ్ డీజీపీ
- సెల్ఫ్ క్వారంటైన్ కు నిరాకరించిన వ్యక్తిని పరికరంతో పట్టేసిన పోలీసు
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని దూరం నుంచే పట్టుకునేందుకు వినూత్న పరికరం రూపొందించారు. ఇది రెండు మీటర్ల పొడవుతో పాములు పట్టే రాడ్ తరహాలో ఉంటుంది. దాని చివరన ఓ బ్రేక్ వంటి ఏర్పాటు ఉంటుంది. దాంట్లో ఓ వ్యక్తిని బంధించి లాక్ చేయొచ్చు. దీనికి సంబంధించిన వీడియోను చండీగఢ్ డీజీపీ సంజయ్ బనివాల్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. సెల్ఫ్ క్వారంటైన్ కు నిరాకరించిన ఓ వ్యక్తిని పోలీసు ఆ పరికరంతో ఎలా ట్రాప్ చేశాడో వీడియోలో చూడొచ్చు.