Kalva Srinivasulu: శ్రీకాళహస్తి ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి: టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు డిమాండ్

TDP Leader Kalva Srinivasulu Demands to arrest srikalahasti MLA
షార్ట్స్‌లో చూడండి
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. కాళహస్తిలో ర్యాలీ నిర్వహించిన ఆ ఎమ్మెల్యే వల్లనే అక్కడ  కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు సీఎం జగన్ తన చిత్తశుద్ధిని చాటుకోవాలని సూచించారు.

 నేను ఎటువంటి ర్యాలీ నిర్వహించలేదు: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

కాల్వ శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఖండించారు. తాను ఎటువంటి ర్యాలీని నిర్వహించలేదని స్పష్టం చేశారు. తప్పు చేస్తే కనుక తనను అరెస్ట్ చేయవచ్చని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. పక్క రాష్ట్రంలో దాక్కున్న బాబు దుష్ప్రచారం చేస్తున్నారని  ధ్వజమెత్తారు.
Go Back to Shorts
Kalva Srinivasulu
Telugudesam
Madhusudhan Reddy
Mla
Srikalahasti

More Telugu News