Chandrababu: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు: ఏపీ సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ చంద్రబాబు

chandrababu fires on ap govt
షార్ట్స్‌లో చూడండి
కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్‌  చాలా మంచి నిర్ణయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియా సమావేశంలో మాట్లాడారు. 14 రోజుల నుంచి 25 రోజుల్లోగా ఎప్పుడైనా వైరస్ బయట పడుతుందని చెప్పారు.

ఈ వైరస్‌తో దేశంలో ఇప్పటికే 590 మంది మృతి చెందారని చంద్రబాబు తెలిపారు. 'రాష్ట్రంలో నిన్న అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే నిన్న కేసులు పెరిగాయి. అన్ని రాజకీయ పార్టీలతో ఓ సమావేశం నిర్వహించండి. చాలా సార్లు ప్రభుత్వానికి ఈ విషయం చెప్పాం. ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఇది వైసీపీకి చెందిన సొంత విషయం కాదు... ఇది ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విషయం. ఈ పోరులో అందరం కలిసి పోరాడాలి.  మీ ఇష్ట ప్రకారం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.. ఇది ఒక రాష్ట్రానికే సంబంధించిన విషయం కూడా కాదు. దేశానికి సంబంధించిన విషయం కూడా. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం. ప్రజలు బతికితేనే మనం రాజకీయాలు చేస్తాం.. వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బాధ్యతతో ప్రవర్తించాలి. మేము చెప్పే విషయాలపై మీరు రాజకీయాలు చేస్తున్నారు' అని చంద్రబాబు మండిపడ్డారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Andhra Pradesh
Corona Virus

More Telugu News