యూపీ సీఎం యోగి తండ్రి మృతి.. అంత్యక్రియలకు హాజరుకాలేనన్న ఆదిత్యానాథ్!

20-04-2020 Mon 15:26 | National
  • అనారోగ్య కారణాలతో ఇవాళ మృతి చెందిన ఆనంద్ సింగ్
  • ఓ సమావేశంలో ఉండగా ఈ విషాదవార్త తెలుసుకున్న యోగి
  • చివరి క్షణాల్లో ఆయనతో వుందామనుకున్నా కుదర్లేదన్న యోగి  
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్ట్ (89)  ఈరోజు మృతి చెందారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ‘కోవిడ్-19’ పై నిర్వహిస్తున్న ఓ సమావేశంలో యోగి పాల్గొన్న సమయంలో తన తండ్రి మరణవార్త సమాచారం ఆయనకు అందింది.

తన తండ్రి మృతిపై  యోగి ఆదిత్యానాథ్  విచారం  వ్యక్తం చేశారు. రేపు నిర్వహించనున్న తన తండ్రి అంతిమసంస్కారాలకు తాను హాజరు కాలేకపోతున్నానని, ‘కరోనా’ కట్టడికి చేస్తున్న పోరాటం నేపథ్యంలోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తన తండ్రి మరణవార్త విని చాలా బాధపడ్డానని అన్నారు. నమ్మకంగా ఉండడం, కష్టపడడం, నిస్వార్థంగా ఉండటం గురించి తన తండ్రి తనకు ఎప్పుడూ చెబుతుండేవారని గుర్తుచేసుకున్నారు.

తన తండ్రి చివరి క్షణాల్లో ఆయనతో గడుపుదామనుకున్నాను కానీ, రాష్ట్రంలోని 23 కోట్ల మంది ప్రజలను రక్షించాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. ఉత్తరాఖండ్ లోని పౌరి జిల్లాలోని స్వగ్రామానికి ఆనంద్ సింగ్ బిష్ట్ భౌతిక కాయాన్ని తరలించనున్నారు. రేపు తన తండ్రి అంత్యక్రియలకు హాజరుకానున్న తన తల్లి, బంధువులు లాక్ డౌన్ నిబంధనలను పాటించాలని కోరారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత తాను అక్కడికి వెళతానని చెప్పారు.

 ప్రముఖుల సంతాపం

యోగి తండ్రి మృతిపై పలువురు రాజకీయప్రముఖులు  సంతాపం తెలిపారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకా గాంధీ వాద్రా తదితరులు వారిలో ఉన్నారు.  
Yogi AdityanathUttar PradeshFatherAndnd singh bisthdeath

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more