కరోనాలోనూ తేడాలు... విదేశీ వైరస్ కన్నా బలంగా మర్కజ్ వైరస్!
- ఇరాన్, ఇండొనేషియా నుంచి వచ్చిన వైరస్ బలం
- త్వరగా కోలుకుంటున్న పశ్చిమ దేశాల వైరస్ బాధితులు
- వైరస్ వ్యత్యాసాలపై పరిశోధనలు సాగాలంటున్న నిపుణులు
కొన్ని ప్రాంతాల బాధితుల్లో వైరస్ బలహీనంగా కనిపిస్తూ, త్వరగా నిర్వీర్యం అవుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వైరస్ బలంగా ఉందని వెల్లడించారు. ఇటలీ, ఫ్రాన్స్, యూఎస్, జర్మనీ, స్పెయిన్ దేశాల నుంచి వచ్చి, కరోనా సోకిన వారిలో వైరస్ స్థాయి బలంగా లేదని, వైరస్ రూపాంతరం చెంది బలహీనపడి వుండవచ్చని నిపుణులు అంచనా వేశారు.
పశ్చిమ దేశాల నుంచి వచ్చి వైరస్ సోకిన వారిలో 60 ఏళ్లు దాటిన వారు కూడా రెండు వారాల్లో కోలుకున్నారని తెలుస్తుండగా, మర్కజ్ బాధితుల్లో 50 ఏళ్లు దాటిన వారు కూడా కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. దీని ప్రకారం, ఇండొనేషియా, ఇరాన్ దేశస్థుల్లో ఉన్న వైరస్ చాలా బలమైనదని విశ్లేషిస్తున్నారు. వైరస్ లో వ్యత్యాసాలపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి వుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.