‘కరోనా’ సోకిన వారికి ప్రయోగాత్మకంగా ప్లాస్మా చికిత్స చేస్తాం: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Aravind Kejriwal Statement
  • కేంద్ర ప్రభుత్వం అనుమతులు లభించాయి
  • మూడు నాలుగు రోజుల్లో ప్రయోగాత్మకంగా ప్లాస్మా చికిత్స
  • ఇది విజయవంతమైతే ‘కరోనా’ బారినపడ్డ వాళ్ల ప్రాణాలు కాపాడొచ్చు
కరోనా వైరస్ బారిన పడ్డ వారి ప్రాణాలు కాపాడేందుకు చేసే ప్లాస్మా చికిత్సను ఢిల్లీలో ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సీఎం కేజ్రీవాల్  ఓ ప్రకటన చేశారు. మూడు నాలుగు రోజుల్లో ప్రయోగాత్మకంగా ప్లాస్మా చికిత్స చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు కూడా లభించాయని చెప్పారు. ఈ చికిత్సా విధానం విజయవంతమైతే కనుక తీవ్ర స్థాయిలో  ‘కరోనా’ బారిన పడ్డ వారిని కాపాడుకోవచ్చని చెప్పారు.

ఢిల్లీలో ఇప్పటి వరకూ కరోనా బారినపడ్డ వారి సంఖ్య 1,578 మంది కాగా, 42 మంది కోలుకున్నారని, 32 మంది మృతి చెందారని అన్నారు. ఈ నెల మొదటి వారంలో కరోనా బారిన పడి ఆసుపత్రులలో చేరిన వ్యక్తులు కోలుకుంటున్నారని, రెండు మూడ్రోజుల్లో డిశ్చార్జి అవుతారని తెలిపారు.
Go Back to Shorts
Arvind Kejriwal
AAP
New Delhi
Corona Virus
Plasma Treatment

More Telugu News