Zoom: ‘జూమ్’ యాప్ తో వీడియో కాన్ఫరెన్స్ శ్రేయస్కరం కాదన్న కేంద్ర హోం శాఖ

Central Home Ministry says  ZOOM APP is not preferable
షార్ట్స్‌లో చూడండి
లాక్ డౌన్ నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూమ్ యాప్ ను వినియోగిస్తున్నారని, ఈ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనడం అంత శ్రేయస్కరం కాదని కేంద్ర హోం శాఖ సూచించింది.

భద్రతాపరంగా ఈ యాప్ ను వినియోగించవద్దని ప్రైవేట్ సంస్థలకు సూచిస్తూ ఓ ప్రకటన చేసింది. కాగా, లాక్ డౌన్ ప్రకటన వెలువడిన అనంతరం ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఈ యాప్ ను వినియోగిస్తున్నారు. ఈ యాప్ ద్వారా నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ కు భద్రత లేకుండా పోయిందని ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయి.
Go Back to Shorts
Zoom
APP
Central
Home Ministry

More Telugu News