'ఆర్ ఆర్ ఆర్' కోసం చిత్రీకరించవలసిన సీన్స్ అవే!

RRR Movie
షార్ట్స్‌లో చూడండి
రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే 75 శాతం చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ .. కొమరమ్ భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. చరణ్ సోలో సీన్స్ .. ఎన్టీఆర్ సోలో సీన్స్ ను చిత్రీకరించారట. అలాగే ఈ ఇద్దరి కాంబినేషన్లోని సన్నివేశాల చిత్రీకరణను కూడా పూర్తి చేశారట.

హీరో హీరోయిన్ల మధ్య చిత్రీకరించవలసిన సన్నివేశాలు మాత్రమే మిగిలిపోయాయని సమాచారం. చరణ్ జోడీగా అలియా భట్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ సరసన ఒలీవియాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు జంటల మధ్య వేరువేరుగా చిత్రీకరించవలన సన్నివేశాలు .. పాటలను సిద్ధం చేసి వుంచారట. లాక్ డౌన్ తరువాత వాటి చిత్రీకరణ జరపనున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Junior NTR
Charan
Alia Bhatt
Oliviya

More Telugu News