కరోనా చికిత్సలో మత వివక్ష.. అహ్మదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో హిందూ, ముస్లింలకు వేర్వేరు వార్డులు
- వార్డుల విభజన నిజమే అన్న మెడికల్ సూపరింటెండెంట్
- ప్రభుత్వ ఆదేశాల మేరకే ఇలా చేసినట్టు వివరణ
- తమకు తెలియదన్న ఆరోగ్య శాఖ మంత్రి
మతం ఆధారంగా వార్డులను విభజించడం గురించి తనకు తెలియదని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి నితిన్ పటేల్ చెప్పడం గమనార్హం. అహ్మదాబాద్ కలెక్టర్ కేకే నిరా కూడా తాము అలాంటి ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదన్నారు. మరోవైపు మతం ఆధారంగా వార్డుల విభజన నిజమేనని అక్కడి రోగులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి ఒక బ్లాక్‌లోని 28 మందిని వారి పేర్లు ఆధారంగా బయటకు పిలిచి.. మరో వార్డుకు తరలించారని, వాళ్లంతా ఒకే మతానికి చెందిన వారని ఓ రోగి వెల్లడించారు.