Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Thamanna advises what to do in lock down time
షార్ట్స్‌లో చూడండి
*  ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో గుమ్మం దాటకుండా ఇంట్లోనే వుండడం అన్నది తెగ బోర్ కొట్టేస్తోందంటూ చాలామంది వాపోతున్నారు. అయితే, అలాంటి భావన మనసులోకి రానీవకండి అంటోంది అందాలతార తమన్నా. 'ఇదొక పరీక్షా సమయం. ఇప్పుడే మనం స్ట్రాంగ్ గా వుండాలి. పెదవులపై చిరునవ్వు చెదరనీయకూడదు. ఇంట్లో వాళ్లతో భౌతిక దూరాన్ని పాటిస్తూనే ఆనందకరంగా వుండాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏదో ఒక పని చేసుకోవాలి. ఇవన్నీ నేను చేస్తున్నాను. మీరు కూడా చేయండి.. బోర్ కొట్టదు' అని చెప్పింది తమ్మూ.
*  అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' చిత్రంలో బాలీవుడ్ సెక్సీ భామ ఊర్వశి రౌతేలా కూడా నటించనుంది. ఈమెపై ఓ ఐటెం సాంగ్ ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ గోపీచంద్ నటిస్తున్న 'సీటీమార్' చిత్రంలో నటిస్తోంది.
*  హిందీలో వచ్చిన 'అంధాదూన్' చిత్రాన్ని తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు రమ్యకృష్ణను ఎంచుకున్నారు. అయితే, ఆమె ఈ సినిమా చేయడానికి భారీ మొత్తాన్ని అడుగుతోందట. దాంతో దర్శక నిర్మాతలు ప్రస్తుతం సందిగ్ధంలో పడ్డారని సమాచారం.
Go Back to Shorts
Thamanna
Allu Arjun
Urvasi Rautela
Sukumar
Nitin

More Telugu News