చిట్టి సితార డ్యాన్స్‌.. మహేశ్‌ బాబు నవ్వులు.. వీడియో పోస్ట్ చేసిన నమ్రత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిట్టి సితార డ్యాన్స్‌.. మహేశ్‌ బాబు నవ్వులు.. వీడియో పోస్ట్ చేసిన నమ్రత

sitara dance   her father mahesh babu
  • పచ్చని చెట్ట మధ్య సితార డ్యాన్స్
  • ఈస్టర్‌ సందర్భంగా పోస్ట్ చేసిన నమ్రత
  • అలరిస్తోన్న వీడియో
టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు కూతురు సితారకు సంబంధించిన వీడియోలపై నెటిజన్లు బాగా ఆసక్తి కనబర్చుతారు.  తన కూతురికి సంబంధించిన అప్ డేట్లను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో మహేశ్ భార్య నమ్రత పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా, ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో అభిమానులను అలరిస్తోంది.

పచ్చని మొక్కల మధ్య కొన్నేళ్ల క్రితం ఈస్టర్‌ సందర్భంగా సితార డ్యాన్స్‌ చేసింది. అప్పటి వీడియోను నమ్రత పోస్ట్ చేసింది. ఈ వీడియోలో చిట్టి సితార చేతులు, కాళ్లు కదిలిస్తూ డ్యాన్స్ చేస్తుండడం అబ్బురపరుస్తోంది. ఆమెను చూసిన మహేశ్ బాబు చిరునవ్వులు చిందించాడు.

ఇటీవల సితార సరిలేరు నీకెవ్వరు సినిమాలోని 'డ్యాంగ్ డ్యాంగ్' పాటకు అదిరిపోయే స్టెప్పులేస్తూ డ్యాన్స్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం తెలిసిందే.  సామాజిక మాధ్యమాల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న మహేశ్ బాబు కూతురు సితారకు సంబంధించిన వీడియోలు మహేశ్ బాబు అభిమానులను అలరిస్తుంటాయి. 

తన తండ్రి మహేశ్‌ బాబు సినిమాల్లోని పాటలు పాడడం, డ్యాన్సులు వేయడం సితారకు చిన్నప్పటి నుంచి అలవాటుగా మారింది. గతంలోనూ తన తండ్రి సినిమా పాటలను పాడిన ఆమె వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ హల్‌చల్‌ చేసి, ఆ సినిమాలకు మరింత పబ్లిసిటీ తెచ్చిపెట్టాయి.
sitara
Mahesh Babu
namrata
Viral Videos

More Telugu News