ఐపీఎల్ ఈ ఏడాది తప్పకుండా జరిగి తీరుతుంది: స్టీవ్ స్మిత్
- గత నెలలో ప్రారంభం కావాల్సిన ఐపీఎల్
- కరోనా మహమ్మారి కారణంగా ఈ నెల 15కు వాయిదా
- మరోమారు వాయిదా పడే అవకాశం
2015లో షేన్ వాట్సన్ నుంచి బాధ్యతలు అందుకున్నానని పేర్కొన్న స్మిత్.. రాజస్థాన్ రాయల్స్‌కు రెండు సీజన్లలో కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే కెప్టెన్సీ చేశానని, ఈసారి పూర్తిస్థాయిలో సారథ్యం వహించేందుకు ఉవ్విళ్లూరుతున్నానని పేర్కొన్నాడు. కాగా, గత నెలలో ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ ను, కరోనా వైరస్ దేశంలో శరవేగంగా విస్తరిస్తుండడంతో ఈ నెల 15కు వాయిదా వేశారు.
అయితే, పరిస్థితి నెమ్మదించకపోవడం, దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 15న ఐపీఎల్ నిర్వహించడం కష్టమేనని అంటున్నారు. ఈ నెల 14వ తేదీ లోపు ఐపీఎల్‌పై బీసీసీఐ మరోమారు ప్రకటన చేసే అవకాశం ఉంది.