నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో అదితీరావు?
- ఇంద్రగంటితో నాని మూడో సినిమా
- 'సమ్మోహనం'తో హిట్ కొట్టిన సుధీర్ బాబు
- అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు
ఈ నేపథ్యంలో అదితీరావు పాత్ర కూడా నెగెటివ్ షేడ్స్ తో కూడినదిగా వుంటుందనే టాక్ వినిపిస్తోంది. ఆమె పాత్రను డిజైన్ చేసిన తీరు కొత్తగా ఉంటుందనీ, ఆ పాత్ర ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతో చూడాలి మరి. ఇంద్రగంటి - నాని కాంబినేషన్లో వచ్చిన 'అష్టా చమ్మా' .. 'జెంటిల్ మేన్' భారీ విజయాలను అందుకున్నాయి. ఇంద్రగంటి - సుధీర్ బాబు కాంబినేషన్లో వచ్చిన 'సమ్మోహనం' కూడా హిట్ కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.