లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకున్న మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం
- 15వ తేదీ నుంచి పని చేయనున్న కార్యాలయాలు
- రోడ్లపై వాహనాలకు అనుమతి
- ప్రైవేట్ వ్యాపారాలపై మాత్రం కొనసాగనున్న నిషేధం
రోడ్లపై అన్ని వాహనాలను అనుమతిస్తామని, వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగుతాయని మేఘాలయ ప్రభుత్వం తెలిపింది. విద్యా సంస్థలు మాత్రం ఏప్రిల్ 30 వరకు మూతపడతాయని చెప్పింది. మేఘాలయలో ఇంత వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. దీంతో, లాక్ డౌన్ ఆంక్షలను సడలించేందుకు ఆ రాష్ట్రం సిద్ధమవుతోంది. అయితే వైద్య అధికారుల సూచనలను గ్రామీణ ప్రాంత ప్రజలు కచ్చితంగా పాటించాలని హెచ్చరించింది.