సరిహద్దులను మూసేసి ప్రాథమిక హక్కులను కాలరాస్తోంది: కర్ణాటక తీరుపై సుప్రీంలో కేరళ అఫిడవిట్
- కర్ణాటక తీరుతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు
- నిత్యావసరాల సరఫరాను అడ్డుకుంటోంది
- కేంద్రం సత్వరమే జోక్యం చేసుకునేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థన
సరిహద్దులను మూసివేయడం వల్ల ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోయారని, సరిహద్దులను తెరవాలన్న కేరళ హైకోర్టు ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసిన తర్వాత మరొకరు చనిపోయారని కేరళ పేర్కొంది. ఈ విషయంలో కేంద్రం సత్వరమే జోక్యం చేసుకుని కర్ణాటక మూసివేసిన సరిహద్దులను తెరిపించాలని చికిత్స కోసం రోగులు వెళ్లేలా, నిత్యావసరాల సరఫరా సాఫీగా సాగేలా చర్యలు తీసుకునేలా చూడాలని కేరళ ప్రభుత్వం సుప్రీంలో దాఖలు చేసిన అఫిడవిట్లో కోరింది. అత్యున్నత ధర్మాసనం నేడు ఈ కేసును విచారించనుంది.