Guntur: కరోనా బాధితుడి ఇంట్లో చోరీ...దర్యాప్తునకు వెళ్లిన నలుగురు కానిస్టేబుళ్లకు కూడా క్వారంటైన్‌

four constables send to quraintain centre
షార్ట్స్‌లో చూడండి
విధుల నిర్వహణలో భాగంగా కరోనా బాధితుడి ఇంటికి దర్యాప్తునకు వెళ్లిన నలుగురు కానిస్టేబుళ్లను అధికారులు ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. వివరాల్లోకి వెళితే...గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో జరిగిన మర్కజ్‌ ప్రార్థనలకు (తబ్లిగీజమాత్‌) హాజరయ్యాడు. ఆ సమయంలో అతని ఇంట్లో చోరీ జరిగింది. తిరిగి వచ్చిన అతను తన ఇంట్లో చోరీ  జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుళ్లు నలుగురు ఆయన ఇంటికి వెళ్లి అవసరమైన వివరాలు, ఆధారాలు సేకరించారు.

ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన  తబ్లిగీ జమాత్‌కు వెళ్లిన వారిలో ఎక్కువ మంది కరోనా బారిన పడినట్లు నిర్థారణ అయ్యింది. వారిలో తన ఇంట్లో చోరీ జరిగిందని ఫిర్యాదు చేసిన వ్యక్తి కూడా ఉన్నాడు. దీంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు బాధితునితోపాటు అతని ఇంట్లో దర్యాప్తు నిర్వహించిన నలుగురు కానిస్టేబుళ్లను క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. వీరి నుంచి శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపారు. నివేదిక వచ్చి నెగెటివ్‌ అని తేలితే తప్ప వీరు బయటకు వచ్చే అవకాశం లేదు.
Go Back to Shorts
Guntur
Theaft
four constables
Quarantine Centre

More Telugu News