పోలీసు సేవలకు గౌరవం.. పూలవర్షం కురిపించిన మీరట్ వాసులు
- రోడ్డుకు ఇరువైపులా నిల్చుని వాహనాలపై పూలవర్షం
- వారి సేవలు అనిర్వచనీయమని ప్రశంసలు
- వైరల్ అవుతున్న వీడియో
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కరోనా వైరస్ దేశంలో అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో దానికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు చేస్తున్న సేవలు అనిర్వచనీయమని ఈ సందర్భంగా మీరట్ వాసులు కొనియాడారు. కుటుంబాలను వదిలిపెట్టి, తమ ప్రాణాలను పణంగా పెట్టి సమాజానికి వారు సేవ చేస్తున్నారని ప్రశంసించారు.