ఎట్టకేలకు గాయని కనిక కపూర్ కు కరోనా నెగెటివ్
- ఐదో పరీక్షలో కనికకు కరోనా లేదని వెల్లడి
- ఇటీవలే లండన్ నుంచి వచ్చిన కనిక
- గత నాలుగు పర్యాయాలు కరోనా పాజిటివ్ రావడంతో ఆందోళన
ఆమెకు గత నాలుగు పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడంతో, ఆమె ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. చివరికి ఐదో పర్యాయం ఆమెకు కరోనా నెగెటివ్ అని రావడంతో కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, కనిక తన ప్రవర్తనతో ఆసుపత్రి వర్గాలను కూడా విసిగించింది. తనకు సౌకర్యాలు కల్పించడంలేదంటూ ఇంతెత్తున ఎగిరిపడింది. దాంతో ఆసుపత్రి వర్గాలు ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి.