మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్.. మంగళగిరిలో హై అలెర్ట్!
- బాధితుడి ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల మేర రెడ్‌జోన్‌గా ప్రకటన
- కూరగాయల దుకాణాలు, షాపులు మూసివేత
- గుంటూరులో అత్యధికంగా 20 కేసులు
అతడితోపాటు ఐదుగురు కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించినట్టు పేర్కొన్నారు. కేసు వెలుగు చూడడంతో ముందు జాగ్రత్త చర్యగా సమీపంలో కూరగాయల దుకాణాలు, మార్కెట్లను మూసివేయించారు. 144 సెక్షన్ విధించి, ఆ ప్రాంతం మొత్తాన్ని హైఅలర్ట్‌గా ప్రకటించారు. కాగా, నిన్న రాష్ట్రంలో 67 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మంగళవారం రాత్రి వరకు 44గా ఉన్న కేసుల సంఖ్య ఒక్కసారిగా 111కు చేరుకుంది. రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 కేసులు నమోదయ్యాయి.