Salman Khan: మేనల్లుడి అంత్యక్రియలకు హాజరు కాలేని స్థితిలో సల్మాన్ ఖాన్!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మేనల్లుడు అబ్దుల్లా ఖాన్, సోమవారం నాడు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. 38 ఏళ్ల అబ్దుల్లా ఖాన్, గుండెపోటు బారిన పడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే, మేనల్లుడి అంత్యక్రియలకు సల్మాన్ ఖాన్ హాజరు కాలేని పరిస్థితి నెలకొంది.

అబ్దుల్లా ఖాన్ అంత్యక్రియలు నేడు ఇండోర్ లో జరుగనుండగా, సల్మాన్ ఖాన్ ముంబైలో ఉండిపోయాడు. కరోనా వ్యాప్తి నివారణకు లాక్ డౌన్ అమలవుతున్న కారణంగా, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో సల్మాన్ ఖాన్ ఈ అంత్యక్రియలకు హాజరు కావడం లేదు.
Salman Khan
Abdullah Khan
Cremation
Corona Virus
Lockdown

More Telugu News