కరోనా వైరస్ జిత్తులమారి... నెగటివ్ వచ్చినా, శరీరంలోనే తిష్ట!
- చైనాలో పరిశోధనలు చేసిన డాక్టర్ లోకేశ్ శర్మ
- సగం మంది శరీరం నుంచి తొలగని వైరస్
- చికిత్స తరువాత క్వారంటైన్ లోనే ఉండాలని సూచన
బీజింగ్ లోని పీఎల్ఏ జనరల్ హాస్పిటల్ లో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 9 మధ్య వ్యాధికి చికిత్స పొందిన 16 మందిపై పరిశోధనలు చేశామని వెల్లడించిన లోకేశ్ శర్మ, వీరి నుంచి రోజు విడిచి రోజు రక్త నమూనాలు సేకరించామని, చికిత్స తరువాత వైరస్ లేదని నిర్ధారణ అయిన వారిలో సగం మందిలో మరో ఎనిమిది రోజులపాటు వైరస్ దాగుందని తెలిపారు. చికిత్స పొందిన వారు మరికొన్ని రోజులు క్వారంటైన్ లో ఉంటేనే మంచిదని సూచించారు.