పీఎం కేర్స్ ఫండ్ కు రైల్వే నుంచి భారీ విరాళం

Railway Employees donation to PM Care Funds
  • రైల్వే సహాయ మంత్రి, నేను ఒక్క నెల వేతనాలను విరాళంగా ఇస్తాం
  • 13 లక్షల మంది రైల్వే  పీఎస్ యూ ఉద్యోగుల ఒక రోజు వేతనం కూడా
  • పీఎం కేర్స్ ఫండ్ కు విరాళంగా రూ.151 కోట్లను అందజేస్తాం: పీయూష్
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక పోరాటం నిమిత్తం ప్రధాని మోదీ  ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్ కు భారీగా విరాళాలు వస్తున్నాయి. రైల్వే శాఖ ఉద్యోగులు తమ ఒక్క రోజు వేతనాన్ని ఈ ఫండ్ కు విరాళమిచ్చారు. ఈ  విషయాన్ని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.  మోదీ పిలుపు మేరకు రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్‌ అంగాడి, తాను ఒక్క నెల జీతాన్ని, పదమూడు లక్షల మంది రైల్వే  పీఎస్ యూ ఉద్యోగులు వారి ఒక్క రోజు వేతనాన్ని విరాళంగా ఇస్తామని,  పీఎం కేర్స్ ఫండ్ కు రూ.151 కోట్లను అందజేస్తామని అన్నారు. ఈ సందర్భంగా తన తోటి ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు.
Go Back to Shorts
Piyush Goyal
Indian Railways
PM Cares Fund
Narendra Modi
Prime Minister

More Telugu News