10 కోట్లకి వెళ్లిన వెంకటేశ్ పారితోషికం?
- వెంకటేశ్ కి హిట్ తెచ్చిన 'ఎఫ్ 2'
- 'ఎఫ్ 3' సినిమాకి సన్నాహాలు
- త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
ఇక తాజాగా వెంకటేశ్ కూడా తన పారితోషికాన్ని పెంచేసినట్టుగా తెలుస్తోంది. 'ఎఫ్ 3' సినిమాకి ఆయన 10 కోట్లను డిమాండ్ చేశారట. అయితే 'దిల్' రాజుతో వున్న సాన్నిహిత్యం కారణంగా, ఆల్రెడీ 'ఎఫ్ 2' సక్సెస్ ఇచ్చినందువలన కొంత తగ్గినట్టు చెబుతున్నారు. ఆ తరువాత సినిమా నుంచి మాత్రం ఆయన 10 కోట్లకి తగ్గకూడదనే ఉద్దేశంతో వున్నారని అంటున్నారు. ఒకటి రెండు హిట్లు పడితే నాగార్జున కూడా తన పారితోషికాన్ని పెంచే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.