చిరూ చిన్నల్లుడికి జోడీగా అవికా గోర్
- 'చిన్నారి పెళ్లికూతురు'తో పరిచయం
- 'ఉయ్యాలా జంపాలా'తో ఫస్టు హిట్
- కల్యాణ్ దేవ్ జోడీగా సినిమా
అలా 'రాజుగారి గది 3' చేసిన అవికా, చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ జోడీగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. 'విజేత' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన కల్యాణ్ దేవ్, 'సూపర్ మచ్చి'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ తరువాత సినిమాగా శ్రీధర్ సీపాన దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం అవికా గోర్ ను తీసుకున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు.