తగ్గిన కరోనా భయంతో కోలుకున్న ఆసియా మార్కెట్లు... నేటి సెషన్ ఆరంభంలోనే భారీ లాభాలకు అవకాశం!
- చైనాలో తగ్గిన రోజువారీ మరణాల సంఖ్య
- కరోనాకు ఔషధం సిద్ధమవుతోందంటున్న పలు దేశాలు
- 6.74 శాతం పెరిగిన నిఫ్టీ
- 5 శాతానికి పైగా లాభంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ
కాగా, మంగళవారం నాడు నిక్కీ సూచిక ఏకంగా 6.74 శాతం పెరిగింది. స్ట్రెయిట్స్ టైమ్స్ 3.38 శాతం, హాంగ్ సెంగ్ 3.90 శాతం, తైవాన్ వెయిటెన్డ్ 5.84 శాతం, కోస్పీ 6.85 శాతం, సెట్ కాంపోజిట్ 2.79 శాతం, జకార్తా కాంపోజిట్ 1.11 శాతం, షాంగై కాంపోజిట్ 1.64 శాతం లాభపడ్డాయి. సోమవారం నాటి యూరప్ సూచికలు మాత్రం నష్టపోయాయి. ఎఫ్టీఎస్ఈ 3.79 శాతం, సీఏసీ 3.32 శాతం, డీఏఎక్స్ 2.10 శాతం దిగజారాయి.